WTC విన్నర్ ను నిర్ణయించేందుకు ఫైనల్ లో 3 మ్యాచుల సిరీస్ ను నిర్వహిస్తే బాగుంటుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. WTC ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘ఇలాంటి ఫైనల్ కు సన్నద్ధం కావడానికి కనీసం 20-25 రోజుల సమయం కావాలి. ఐపీఎల్ తర్వాత ఎలాంటి వార్మప్ మ్యాచ్ లేకుండా నేరుగా ఫైనల్ ఆడాము. ప్లేయర్లకు తగినంత సమయంతో పాటు విశ్రాంతి అవసరం’ అని చెప్పారు.
ఇక అటు WTC ఫైనల్ లో బెస్ట్ క్రికెట్ ఆడలేకపోయామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘బ్యాటర్లు పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సింది. కానీ విఫలమయ్యారు. తొలిరోజు బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చారు. 469 రన్స్ ఇవ్వాల్సిన పిచ్ కాదిది. మన ప్లేయర్లు తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదు. ఫైనల్ మ్యాచ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఇంకాస్త సమయం ఉంటే బాగుండేది’ అని చెప్పారు.