హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తనపై కేసు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు ఆయన అందజేశారు. 28 ఏళ్ల క్రితం అమ్ముగూడ రైల్వే స్టేషన్ పేలుడు ఘటనలో గద్దర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉంది. ఇటీవల కాలంలో తనపై ఉన్న కేసును తొలగించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు డీజీపీకి గద్దర్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనపై కేసును ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తనపై ఉన్న కేసును తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను పోలీసులకు అందజేశారు.
కాగా గద్దర్ ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు. ప్రత్యేక తెలంగాణతో పాటు పలు ఉద్యమాల్లో ఆయన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపారు. గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోఇస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. అంతేకాదు తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో రాజకీయ పార్టీని కూడా స్థాపించారు.