హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆస్తిపన్ను చెల్లింపునకు నేడే తుది గడువు

-

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే తుదిగడువు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 11 గంటల వరకు ఆస్తిపన్ను చెల్లించేందుకు జీహెచ్​ఎంసీ అవకాశం కల్పించింది. ఆర్థిక ఏడాది మొదటిలో రికార్డు స్థాయిలో వసూళ్లు అయినా…. ఏడాది చివరికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కాలేదు.

గురువారం వరకు మొత్తం 1600 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలైంది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 2వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా కేవలం 80 శాతం మాత్రమే పూర్తయింది. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తి పన్నే. వీటి ద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీత భత్యాల చెల్లింపులు చేస్తుంది.

ఇవాళ ఆస్తి పన్ను చెల్లించేందుకు చివరి రోజు కావడంతో రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఆస్తి పన్ను ఆన్‌లైన్‌లో కట్టడం… ఇంటింటికి వెళ్లి పన్ను వసూళ్లు చేయడం…. ఎర్లీ బర్డ్ ఆఫర్ పెట్డడంతో అధికంగా వసూళ్లు అవుతున్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news