సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌.. ఏప్రిల్‌ 9నుంచి అందుబాటులోకి

-

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు తిరుపతి పుణ్యక్షేత్రానికి రైలు, బస్సు, సొంత వాహనాల్లో వెళ్తుంటారు. అయితే రోడ్డు మార్గాన ఎలా వెళ్లినా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే దాదాపు 10 నుంచి 12 గంటలపాటు సమయం పడుతుంది. అయితే ఈ ప్రయాణ సమయాన్ని తగ్గించి తెలంగాణ వాసులు కాస్త వేగంగా తిరుమల చేరుకునేందుకు వందే భారత్​ రైలు అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది. ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజూ తిరుగుతుంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించబోరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. గురువారం అధికారికంగా ప్రకటించిన ప్రయాణ సమయాలివి.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.

తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

Read more RELATED
Recommended to you

Latest news