GINNA : మంచు విష్ణు “జిన్నా” ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

-

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కధ, స్క్రీన్ ప్లే అందించగా.. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాల్సింది. కానీ అదే రోజు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలు రిలీజ్ అవుతున్న కారణంగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. టెంట్ హౌస్ కు ఓనర్ గా మంచు విష్ణు ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ దసరా రోజున రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు మంచు విష్ణు పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news