అమ్మడు నీ చల్లని ఐడియా అదుర్స్..

-

ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది.. అనే డైలాగు అందరికి తెలిసిందే..ఏదైనా ఆలోచన ఉంటే సరిపోదు వాటిని ఆచరణలో పెట్టే ఆసక్తి కూడా ఉండాలి.అప్పుడే మనం అనుకుంది అనుకున్నట్లు జరుగుతుంది. చదువుతో సంబంధం లేకుండా ఎందరో ఎన్నో చేస్తారు. అవి వార్తల్లో నిల్వడంతో ఒక్కసారిగా సెలెబ్రిటీలు అయిపోతారు. ప్రస్తుతం మండే ఎండలు భగ్గుమంటున్నాయి.. నీళ్ళు చల్లగా లేనిది ఎవ్వరు తాగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే మనం బయటకు వెళితే చంకలో ఫ్రిజ్ ను పెట్టుకొని తీసుకెల్లలేము.

ఫ్రిజ్‌ లేకుండానే బాటిల్‌లో నీళ్లను చల్లబరిచే పరికరాన్ని వారణాసికి చెందిన బీకామ్‌ విద్యార్థిని అంచల్‌ సింగ్‌ కనుగొన్నారు.వావ్.. వింటుంటే భలే గమ్మత్తుగా ఉంది కదూ..ఆ పరికరంలో థర్మల్‌ కూలింగ్‌ ప్లేటు, చిన్న సోలార్‌ ప్లేటు, చిన్న ఫ్యాను, బెల్టు ఉంటాయి..బాటిల్‌కు బెల్టును చుట్టి ఎండలో పెడితే సోలార్‌ ప్లేటుతో కరెంటు జెనరేట్‌ అయ్యి నీళ్ళు చల్ల బడతాయి.ఒక లీటర్‌ నీళ్లు కూల్‌ కావడానికి గంట సమయం పడుతుంది. దీని తయారీకి రూ.4 వేలు ఖర్చు అయినట్టు అంచల్ అన్నారు. బయట ఏది పడితే అది తాగి అనారొగ్య పాలు కావడం కన్నా ఇలాంటి వాటిని ఎంచక్కా ఉపయోగించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news