రూ.10లకు గర్ల్‌ఫ్రెండ్‌.. మూడు వేలకు బాయ్‌ఫ్రెండ్‌.. అద్దెకు ఆనందం..!!

-

వాలెంటైన్స్‌ డో రోజు.. లవర్‌ లేని సింగిల్స్‌ అందరూ తెగ ఫీలై ఉంటారు కదా..! చాలామందికి లవర్‌ కావాలి కానీ.. శాశ్వతంగా వద్దు అనుకుంటారు. వాళ్లకు గిఫ్ట్‌లు, ఔటింగ్‌లు, మెయింటెన్స్‌ ఇవన్నీ భరించలేరు. సరదగాగా మాట్లాడుకోవడానికి, కష్టసుఖాలను పంచుకోవడానికి మాత్రం ఒక తోడు కావాలి.. అలాంటి ఫెసిలిటీ ఒకటుంది. ఆన్‌లైన్‌లో సరకులు ఆర్డర్‌ చేసినట్లు.. ఆ యాప్‌లో గర్లఫ్రెండ్‌, బాయ్‌ఫ్రెండ్ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఒకరోజు ప్రేమ చూపించి డబ్బులు తీసుకుని వేరే దారిలో వెళ్లిపోయే బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్‌లు కూడా కిరాయికి దొరుకుతున్నారు. మన దేశంలో కూడా ‘బాయ్‌ఫ్రెండ్స్‌ని కిరాయికి’ తీసుకునే సర్వీస్ మొదలైంది. ఇది అమ్మాయిలకు ట్రీట్, కానీ అయ్యో అబ్బాయిలు ఇక్కడ అలాంటివి పొందలేరు. 2022లో బెంగళూరులో ఇలాంటి రెండు యాప్‌లు ప్రారంభించారు. ఈ యాప్‌ల కథేంటో మనమూ చూద్దామా..!
ఈ యాప్‌ ద్వారా అమ్మాయిలు తమ హృదయాన్ని తేలిక చేసుకోవడానికి బాయ్‌ఫ్రెండ్‌లను ఆర్డర్‌ చేసుకుంటారు.. బుక్ చేసుకున్నాం కదా అని వారిని ఎక్కడికీ తీసుకుపోలేం. కేవలం ఫోన్ లోనే వారు నవ్విస్తారు, బుజ్జగిస్తారు, ఓదారుస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఫోన్‌లో మాట్లాడుతారు అంతే. గర్ల్‌ఫ్రెండ్స్‌ని అద్దెకు తీసుకునే ట్రెండ్ మన దేశంలో ఇంకా రాలేదు.. కానీ 2018 నుంచి పొరుగు దేశమైన చైనాలో గర్ల్‌ఫ్రెండ్స్‌ని షో ఆఫ్ కోసం నియమించుకునే ట్రెండ్‌ నడుస్తోంది. అప్పట్లో 20 నిమిషాల సర్వీస్‌కు రూ.10 వసూలు చేసేవారు, షాపింగ్ మాల్స్‌లో ఈ సర్వీస్ అందుబాటులో ఉండేది. స్టాండ్‌లో 10-15 మోడల్‌లు ఉండేవారు.. వాటిలో ఒకటి 20 నిమిషాలకు 10 రూపాయలకు అద్దెకు తీసుకుంటారు.. వారిని తాకడానికి లేదా మాల్ నుండి బయటకు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.
lovers
ఇప్పుడు గర్ల్‌ఫ్రెండ్ సర్వీస్ కూడా యాప్‌లో అందుబాటులో ఉంది. చైనా, జపాన్‌లలో మీరు యాప్ ద్వారా మీ కోసం స్నేహితురాలిని సులభంగా అద్దెకు తీసుకోవచ్చు. మీరు వారితో కలిసి తినవచ్చు, త్రాగవచ్చు, తిరుగుతూ డబ్బు చెల్లించిన తర్వాత వారిని ఇంట్లో దింపవచ్చు. ఇలాంటి సర్వీస్ ప్రియుడి కోసం కూడా ఉంది. మీకు కావలసిన ప్రియుడు యొక్క అవసరాన్ని యాప్ ద్వారా తెలిపితే సంబంధిత వ్యక్తి మీ కళ్ల ముందు కనిపిస్తాడు. జపాన్‌లో 1 గంటకు బాయ్‌ఫ్రెండ్‌ని అద్దెకు తీసుకోవడానికి, మీరు 5000 జపనీస్ యెన్ అంటే మన కరెన్సీలో 3000 చెల్లించాలి. అవును, అవసరమైతే మొత్తం కుటుంబాన్ని కూడా జపాన్‌లో అద్దెకు తీసుకోవచ్చు.

హగ్‌ ఫెసిలిటీ కూడా..

మనదేశంలో అలానే కౌగిలింతలు ఇచ్చే అలవాటు ఉంది కానీ, విదేశాల్లో దానికి సరైన సర్వీస్ ఉంటుంది. జపాన్‌లో అటువంటి సర్వీస్ 2011 సంవత్సరంలో ప్రారంభమైంది, దీనిలో 7 గంటల నుంచి 12 గంటల వరకు మెను కార్డ్ ఉంది. ఇందుకు రూ.17 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తారు. ఇంతకుముందు ఈ సర్వీస్ కేవలం అమ్మాయిలకు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న అమ్మాయిలు కూడా ప్రొఫెషనల్ కౌగిలింతలుగా ప్రజలను కౌగిలించుకొని ఓదార్చడం ద్వారా డబ్బులు సంపాదించేస్తున్నారు..
ఏది ఏమైనా.. ఈ పాశ్చాత్య సంస్కృతిలో ఏదైనా జరుగుతుంది. కాలం మారిపోయింది. బంధాలను పెంచుకోవాల్సింది పోయి.. బయ్‌ చేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news