GodFather : “గాడ్ ఫాదర్” టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌..పవర్‌ ఫుల్‌ పొలిటిషీయన్‌ గా చిరు

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ సాంగ్‌ లో చిరంజీవి చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ లో కనిపించారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అద్భుతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news