దివంగత హీరో బంగ్లాను 100 కోట్లు ఇచ్చి దక్కించుకున్న ప్రముఖ కార్పొరేట్ కంపెనీ..

-

బాలీవుడ్ హీరో రాజ్ కపూర్ బంగ్లాను ప్రముఖ కార్పొరేట్ కంపెనీ చేజిక్కించుకుంది. ముంబైలో ఉన్న ఈ బంగ్లాను గోద్రెజ్ ప్రాపర్టీస్ 100 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఈ బంగ్లా రాజ్ కపూర్ వారసులు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది.

ముంబైలో ఉన్న ప్రముఖ వెటరన్ హీరో రాజ్ కపూర్ బంగ్లాను ప్రముఖ కార్పొరేట్ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయడానికి దాదాపు 100 కోట్లు ఇచ్చి ఈ బంగ్లాను చేజిక్కించుకుంది.. ముంబై చెంబూరు లొకేషన్ లోని డియోనార్ ప్రాంతంలో ఉన్న ఈ బంగ్లా విస్తీర్ణం దాదాపు 4265.50 చ.మీ గా ఉంది. దీని అమ్మకంపై ఫిబ్రవరి 16న రాజ్ కపూర్ వారసులు సంతకాలు చేసినట్టు తెలుస్తోంది..

Bollywood Wallpapers: Raj Kapoor Wallpapers

ఈ బంగ్లా అమ్మకం ఒప్పందంపై ఫిబ్రవరి 16న రాజ్ కపూర్ వారసులైన రణధీర్ కపూర్, రణబీర్ కపూర్, రాజ్ కపూర్, రీమా జైన్, నితాషా నందా, నిఖిల్ నందా, నీతూ రిషి కపూర్ సంతకాలు చేశారని తెలుస్తోంది.. అయితే గత ఏడాది రాజ్ కపూర్ స్టూడియోస్ ని ఛేజిక్కించుకున్న ఇదే ఫర్మ్ ఇప్పుడు ఈ బంగ్లాను కొనుగోలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. అయితే పాపులర్ మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇచ్చిన ఒక ప్రకటనలో.. ”రాజ్ కపూర్ కి చెందిన ఒక ఎకరం బంగ్లాను గోద్రేజ్ దక్కించుకుంది. రూ.500 కోట్ల విలువ చేసే లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నమిది.. ” అంటూ వెల్లడించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news