ఆడపిల్లలని విద్యకి పంపించడం ఈ ఏడాది చాలా వరకు పెరిగిందని ప్రవేశాలు సూచిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. మొదటి సారిగా అబ్బాయిలని దాటి మరీ ఆడపిల్లలని పాఠశాల ప్రవేశాలు బాగా పెరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా గత ఆరు సంవత్సరాలుగా వారికోసం చేస్తున్న పనుల వల్లే సాధ్యమైందని తెలిపారు. స్వఛ్ఛ భారత్ లో భాగంగా దేశ వ్యాప్తంగా 11కోట్ల టాయిలెట్లు నిర్మింపబడ్డాయని గుర్తు చేసారు.
అలాగే పేద ఆడపిల్లలకి కేవలం 1రూపాయికే శానిటరీ ప్యాడ్స్ అందించేలా చేస్తున్నామని అన్నారు. ఐతే ఇదే కాదు ఆడపిల్లల పెళ్ళిళ్ళ వయసు విషయమై మరోమారు నిర్ణయం తీసుకోబోతున్నామని, ప్రస్తుతం ఈ విషయమై ఒక కమిటీ వేయబడిందని తెలిపారు. ప్రస్తుతం ఆడపిల్లల కనీస పెళ్ళి వయసు 18సంవత్సరాలు ఉండగా మగవారికి 21సంవత్సరాలుగా ఉంది.