గుడ్ న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా

-

నిన్న భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు ద‌గ్గుద‌ల న‌మోదు చేసింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 170రూపాయలు తగ్గి 39,770 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 170రూపాయలు తగ్గి 36,480 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు తగ్గి 47,400 వద్దకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గాయి. దీంతో 38,450 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గడంతో 37,250 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 100 రూపాయల తరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news