అందుకే ఎన్‌కౌంట‌ర్ చేశాం… రీజ‌న్ చెప్పిన స‌జ్జ‌నార్‌

-

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన హైద‌రాబాద్‌కు చెందిన వెట‌ర్నరీ డాక్ట‌ర్ దిశ హ‌త్య కేసును పోలీసులు ఎన్‌కౌంట‌ర్‌తో ముగించేశారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్‌ నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న న‌లుగురు అయిన మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చి కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోయేందుకు యత్నించారని సీపీ సజ్జనార్ చెప్పారు.

పారిపోయే ప్ర‌య‌త్నంలో నిందితులు పోలీసుల‌పై రాళ్ల‌తో దాడి చేస్తూ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. వెంట‌నే తేరుకున్న పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో నిందితులు మరణించారని సజ్జనార్ వెల్లడించారు. పట్టపగలు ఈ కేసు రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేస్తే ప్ర‌జ‌లే దాడి చేస్తార‌న్న సందేహంతోనే అర్దరాత్రి దర్యాప్తు కోసం నిందితులను చటాన్ పల్లి వద్దకు తీసుకువచ్చామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు.

ఈ కేసులో అందరూ ఊహించిన విధంగానే సజ్జనార్ కేసుని డీల్ చేసారు. సరిగా 11 ఏళ్ళ క్రితం వరంగల్ యాసిడ్ దాడి విషయంలో ఆ జిల్లా ఎస్పీ గా ఉన్న సజ్జనార్… ముగ్గురు నిందితులను కాల్చి చంపారు. దీనితో ఇప్పుడు కూడా అదే విధంగా సజ్జనార్ న్యాయం చేస్తారని భావించారు పలువురు. అందరూ అనుకున్న విధంగానే ఈ కేసులో ప్రతీ విషయంలో పోలీసులు ఒక చిన్న క్లూ వదులుతూ వచ్చారు… కేసుకి సంబంధించి అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా విచారణ చేస్తామని, నిందితులను సంఘటనా స్థలానికి తీసుకువెళ్తామని చెప్తూ వచ్చారు. అందరూ అనుకున్న విధంగానే సజ్జనార్ తన మార్క్ స్టైల్ లో పని పూర్తి చేసి… ఆడపిల్ల వైపు చూడాలి అంటేనే భయపడేలా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news