ఆంధ్రప్రదేశ్ టూరిజం తలుపులు తెరిచిన ప్రభుత్వం.. ఏవేవి ఓపెన్ అవుతున్నాయంటే,

-

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రాలకు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల పర్యాటక ప్రాంతాలకు ఆదాయం బాగా తగ్గింది. ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభిస్తున్నాయి. కరోనా కేసులు కుడా తగ్గుతుండడంతో ఈ దిశగా రాష్ట్రాల పర్యాటక సంస్థలు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ వెల్లడి చేసారు. గురువారం నుండీ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని ప్రకటన విడుదల చేసారు.

అదీగాక ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాల గురించి మార్కెటింగ్ చేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పర్యాటక ప్రాంతాల గురించి దేశ వ్యాప్తంగా రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం విశాఖ పట్నం రుషికొండ బీచ్ లో బ్లూ బే హోటల్ ని 165కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు

శ్రీ వెంకటేశ్వర దేవాలయం- తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం తిరుపతి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ప్రాంతానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

రుషికొండ బీచ్- విశాఖపట్నం

డాల్ఫిన్ నోస్ కి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం విశాఖపట్నంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతంగా ఉంది.

ఉండవల్లి గుహలు- అమరావతి

విజయవాడకి 6కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు చాలా పురాతనమైనవి. పురావస్తు వస్తువుల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ప్రాంతాన్ని సందర్శిచవచ్చు.

విజయవాడ దుర్గమ్మ

క్రిష్ణా నది ఒడ్డున విజయవాడలో ఇంద్రకీలాద్రి గుట్టపై వెలసిన దుర్గమ్మ రాష్ట్రావ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news