గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. షాక్ ఇచ్చిన వెండి..!

-

నిన్న భారీగా పైకెగ‌సిన బంగారం ధర ఈ రోజు స్వ‌ల్పంగా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర శనివారం తగ్గింది. రూ.80 క్షీణించింది. దీంతో బంగారం ధర రూ.38,880 నుంచి రూ.38,800కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 తగ్గుదలతో రూ.42,410 నుంచి రూ.42,330కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.40 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,810 నుంచి రూ.49,850కు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 క్షీణించింది. దీంతో ధర రూ.39,650కు దిగొచ్చింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.40,850కు తగ్గింది. ఇక్క‌డ కూడా బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ఇక కేజీ వెండి ధర రూ.40 పెరుగుదలతో రూ.49,850కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news