బ్రేకింగ్‌: ద‌డ‌ద‌డ‌లాడిస్తున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

రెండు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర ఈ రోజు కూడా అదే బాట ప‌ట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 పెరుగదలతో రూ.44,430 నుంచి రూ.44,700కు చేరింది. బంగారం ధర రూ.45 వేల మార్క్‌కు ఇంకొంచెం దూరంలోనే ఉంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. ఇది కూడా రూ.270 పెరిగింది. దీంతో ధర రూ.40,730 నుంచి రూ.41,000కు చేరింది. బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.500 పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.51,000 నుంచి రూ.51,500కు ఎగసింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,000కు చేరింది. వెండి ధర రూ.51,500కు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర రూ.240 పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,850కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news