గుడ్ న్యూస్‌: భారీగా క్షీణించిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా అదే బాట‌..!

నిన్న స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈ రోజు భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.360 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.40,970 నుంచి రూ.40,610కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే తగ్గింది. ఇది కూడా రూ.360 పడిపోయింది. దీంతో ధర రూ.44,700 నుంచి రూ.44,340కు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర పతనమైంది. రూ.200 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.50,000 నుంచి రూ.49,800కు దిగొచ్చింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,610కు క్షీణించింది. వెండి ధర రూ.49,800కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి రూ.400 పడిపోయింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,450కు తగ్గింది.