గుడ్ న్యూస్‌: భారీగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌.. ఇదే బాట‌లో వెండి..!!

-

నిన్న భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర‌ ఈ రోజు ప‌త‌న‌మైంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.110 తగ్గింది. దీంతో పసిడి ధర రూ.40,820 నుంచి రూ.40,710కు క్షీణించింది. కాగా బంగారం ధర నిన్న ఒక్క రోజులోనే రూ.210 పైకి కదిలింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. ఇది కూడా రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.44,550 నుంచి రూ.44,410కు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వెండి ధర కూడా పడిపోతూనే వస్తోంది. రూ.30 క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,600 నుంచి రూ.49,570కు దిగొచ్చింది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,710కు క్షీణించింది. వెండి ధర రూ.49,570కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి రూ.100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,600కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news