పసిడి ప్రియులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా ఉండి. ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరతోనే కొనసాగుతుంది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం ధర నిలకడగా ఉండగా.. వెండి ధర మాత్రం పెరిగిపోయింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిన్న రూ. 780 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,460కు చేరింది.. నేడు కూడా అదే ధర కొనసాగుతుంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర నిన్న రూ. 720 తగ్గడంతో రూ. 50,840కు చేరుకుంది.. కాగా, ఇవాళ కూడా అదే ధరతో నిలకడగా ఉంది. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం కొంచం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ. 800 పెరిగింది. దీంతో ధర రూ. 67,800కు చేరింది. అలాగే బంగారం ధర ఔన్స్ కు 1947 డాలర్లగా ఉండగా. వెండి ధర ఔన్స్ కు 26.88 డాలర్లకు చేరింది.