నేడు వినాయక చతుర్థి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తొందరలోనే కరోనా వైరస్ మహమ్మారి నుంచి విముక్తి లభించి రాష్ట్ర, దేశ ప్రజలందరు సాధారణ జీవన పరిస్థితులకు వచ్చేలా చూడాలని వినాయకుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
కాగా, కరోనా వైరస్ కారణంగా గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సుప్రీం కోర్టు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే పండుగ జరుపుకుంటున్నారు.