గోల్డ్ లోన్ క్యాష్ బ్యాక్ ఆఫర్.. కస్టమర్లకు ప్రయోజనం

-

ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకున్నారా.. బంగారంపై రుణం పొందారా.. అయితే మీకో గుడ్ న్యూస్. తాజాగా సంస్థ తన వినియోగదారుల కోసం సరికొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఎవరైనా బంగారం కొనాలని అనుకుంటున్నారా.. అయితే తొందరగా కొనుగోలు చేయండి. బంగారాన్ని కొనుగోలు చేస్తే అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్ మీ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ సరికొత్త స్కీంను అందుబాటులో తెచ్చింది. ఈ స్కీం పేరు ముత్తూట్ ఆన్ లైన్ మనీ సేవర్ ప్రోగ్రామ్ (ఎంఓఎంఎస్). ఈ స్కీం సాయంతో బంగారం కొనుగోలు చేసినప్పుడు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

- Advertisement -
gold
gold

ముత్తూట్ ఫెనాస్స్ నుంచి గోల్డ్ లోన్ పొందిన వారు కూడా వడ్డీ మొత్తాన్ని ఆన్ లైన్ లో చెల్లిస్తే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో డిజిటల్ పేమెంట్స్ ను పెంచాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ స్కీంను అందుబాటులోకి తెచ్చిందని ముత్తూట్ పేర్కొంది. ఈ సరికొత్త స్కీం ద్వారా కస్టమర్లు రూ.1501 వరకు క్యాష్ వస్తుందని, స్కీంకి సంబంధించిన వివరాలు కంపెనీ వెబ్ సైట్ లో పొందిపర్చడం జరిగిందన్నారు. లోన్ వడ్డీ మొత్తాన్ని చెల్లించే సమయంలో మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ మీరు చెల్లించే వడ్డీ మొత్తం నుంచి కట్ అవుతుందని, మీరు చెల్లించే వడ్డీలో తగ్గుతుందన్నారు.

కస్టమర్లు చెల్లించే ధరకు సంబంధించి క్యాష్ బ్యాక్ ఇంత వస్తుంది. రూ.50,000పైన వడ్డీ చెల్లింపునకు రూ.1501 క్యాష్ బ్యాక్, రూ.25,000 నుంచి రూ.49,999 మధ్యలో చెల్లిస్తే రూ.601 క్యాష్ బ్యాక్, రూ.5000 నుంచి రూ.9999 మధ్య చెల్లిస్తే రూ.101 క్యాష్ బ్యాక్, రూ.2500 నుంచి రూ.4999 మధ్య చెల్లిస్తే రూ.51 పొందవచ్చని కంపెనీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...