ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది. జాగ్రత్త తీసుకొని వారు ఎంత వారైనా సరే కష్టాలు తప్పవు. ఇంకా ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపింది. అతని పీఏకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని స్వయంగా ఆయనే తెలిపాడు. అతనికి పాజిటివ్ అని నిర్దారణ అయినా వెంటనే అతను కరోనా టెస్ట్‌లు చేయించుకొని హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు.
కాగా పీఏకి కరోనా పాజిటివ్ రావడంపై రవికిషన్ స్పందిస్తూ.. ”నా దగ్గర పని చేస్తున్న పీఏ గుడ్డూ పాండే(42) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయగా, అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను” అంటూ తెలిపారు.
కాగా రవికిషన్ మన తెలుగు సినిమాలో కూడా నటించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా విలన్ పాత్రలో నటించి అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతనికి తెలుగులో ఎన్నో అవకాశాలు అందుకున్నాడు.