చాలా మంది డబ్బులు అవసరం అయ్యినప్పుడు గోల్డ్ లోన్ ని తీసుకుంటూ వుంటారు. గోల్డ్ లోన్ తీసుకుంటే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు మన చేతికి వస్తాయి. సమస్యలు వుండవు. డబ్బులు చేతికి వచ్చినప్పుడు మళ్ళీ కట్టేసుకోవచ్చు.
అప్పు తీసుకోవడం కంటే కూడా ఇదే బెస్ట్. పైగా తక్కువ వడ్డీ పడుతుంది. అలానే ఇది అత్యంత సురక్షిత రుణ సదుపాయం. ఈ లోన్ ని మీరు పొందాలంటే ఆధార్ కార్డుతో పాటు తనఖా పెట్టాల్సిన బంగారం తీసుకు వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు ఏయే బ్యాంకులు గోల్డ్ లోన్ ని ఎలా ఇస్తున్నారు అనేది చూద్దాం.
ఫెడరల్ బ్యాంకు గోల్డ్ లోన్ మీద తక్కువ వడ్డీ ని వసూలు చేస్తోంది. ఏడు శాతం వడ్డీతో గోల్డ్ లోన్ ఇస్తోంది ఈ బ్యాంకు. ప్రాసెసింగ్ ఫీజుగా లోన్ తీసుకున్న మొత్తం పై 0.56 శాతం తీసుకుంటుంది ఈ బ్యాంకు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 7.25 నుంచి 7.50 శాతం వడ్డీతో ఈ గోల్డ్ లోన్ ని ఇస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 7.10 నుంచి 7.20 శాతం వరకు వడ్డీతో గోల్డ్ లోన్స్ ని అందిస్తోంది. 0.75 శాతం ప్రాసెసింగ్ ఫీజు.
అలానే యూకో బ్యాంకులో గోల్డ్ లోన్ అయితే 7.40 నుంచి 7.90 వరకు వడ్డీ తో గోల్డ్ లోన్ ని ఇస్తోంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 నుంచి 7.50 శాతం వడ్డీతో ఈ లోన్ ని ఇస్తోంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే 7.60 నుంచి 16.81 శాతం వరకు వడ్డీతో గోల్డ్ లోన్ ని ఇస్తోంది.