బుధవారం పెరిగిన పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు గురువారం నాటికి కాస్త తగ్గాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.280 తగ్గడంతో రూ.45,700కు దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గుదలతో రూ.41,840కు దిగి వచ్చింది.
దేశీయంగా కొన్ని రోజులుగా కరోనా దెబ్బకు బంగారం పెరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం డిమాండ్ తగ్గుతుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర రూ.150 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.42,700కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.150 తగ్గింది. రూ.43,900కు పడిపోయింది.
ఇక వెండి ధర రూ.48,500 వద్ద నిలకడగా ఉంది. అయితే పది గ్రాముల బంగారం 50 వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా ఈ తగ్గుదల నమోదు అవుతుంది. కరోనా దెబ్బకు వాణిజ్య యుద్దాలు కాస్త వెనక్కు తగ్గాయి. చైనా వంటి దేశాలు కరోనా తో పోరాడుతున్నాయి. గల్ఫ్ దేశాలు కూడా కరోనా దెబ్బకు ఇబ్బంది పడుతున్నాయి.