దేశంలో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోవడం, బంగారం ధర పెరగడంతో దేశీ మార్కెట్లో గోల్డ్ భారమైంది. మరో వైపు నిన్నకాస్త తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయలు పెరిగి 48,450 రూపాయలకు చేరుకుంది.
అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 470 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో మొత్తం 52,850 రూపాయలుగా నమోదు అయింది. ఇక బంగారం ధరల్లో కొద్ది పాటి పెరుగుదల కనబరిస్తే, నిన్న కొద్దిగా తగ్గుదల కనబరిచిన వెండి ధరల్లో మాత్రం ఈ రోజు భారీగా పెరుగుదల కనబరిచాయి. ఈ రోజు వెండి ధర కేజీకి 1300 రూపాయల పెరుగింది. దీంతో కేజీ వెండి ధర 62,000 దాక చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.