కోవిడ్19 ఫ్లూ లాంటిదే.. ట్రంప్ వ్యాఖ్యలపై ఫేస్ బుక్ యాక్షన్..

-

అమెరికాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశంగా అమెరికా నిలిచింది. మొత్తం రెండులక్షలకి పైగా కరోనా మరణాలు సంభవించాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఐతే కరోనా కేవలం ఫ్లూ లాంటిదే అన్న ట్రంప్ వ్ యాఖ్యలపై ఫేస్ బుక్ యాక్షన్ తీసుకుంది. ప్రపంచాన్నే భయపెడుతున్న కరోనా గురించిన అసత్య వార్తలను ఫేస్ బుక్ ద్వారా ప్రచారం చేయడం నిబంధనలని ఉల్లఘించినట్లేనని అందుకు అనుగుణంగా ఫేస్ బుక్ చర్యలు తీసుకుంది. ఇలాంటి వ్యాఖ్యలని వెంటనే తీసివేస్తామని తెలిపింది.

మరో పక్క ట్విట్టర్, ట్రంప్ చేసిన ట్వీట్ కి రీట్వీట్లని నిలిపివేసింది. కరోనా గురించిన అసత్య వార్తలను ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా చేసామని చెప్పుకొచ్చింది. కోవిడ్ 19 ఫ్లూ లాంటిదే అన్న వ్యాఖ్యలపై చాలా మంది విమర్శిస్తున్నాయి. ప్రతీ ఏటా అమెరికాలో కేవలం ఫ్లూ ద్వారా 21000మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news