మహిళలకు అదిరిపోయే శుభవార్త..భారీగా తగ్గిపోయిన పసిడి ధరలు

-

ప్రపంచంలోని వస్తువుల్లో… బంగారమే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.


చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గి పోయాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి రూ. 51,600 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 47,300 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 72,500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news