`పుష్ప` స్పెషల్ సాంగ్ కోసం బోల్డ్‌ బ్యూటీని ఎంచుకున్న సుక్కు..!!

-

ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్క చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మ‌క మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఇటీవ‌ల బ‌న్నీ బర్త్‌డే సంద‌ర్భంగా విడుదలైన పుష్ప టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. ఊరమాస్‌ లుక్‌లో బ‌న్నీ క‌నిపించ‌డంతో బాగా క్లిక్ అయింది.

అంతేకాదు ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ఐదు భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బ‌న్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. అయితే క‌థ‌, క‌థనం గురించి ప‌క్క‌న పెడితే సుక్కు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంది.

Actress Urvashi Rautela Shared Her Video To Her Fans ...

ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం సుకుమార్ ఓ బోల్డ్ బ్యూని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. అమె ఎవ‌రో కాదు ఊర్వశి రౌతేల. తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత ప‌రిచ‌యం లేక‌పోయానా.. ఈమెకు బాలీవుడ్ బాగానే క్రేజ్ ఉంది. ఎందుకంటే.. కెరీర్ స్టాటింగ్‌ నుంచి తన అందాచందాల‌తో వేడితెర‌ను వేడెక్కించింది ఈ హాట్ బ్యూటి. ఇక ఇప్పటికే ఊర్వశి రౌతేల గోపీచంద్ సీటిమార్ సినిమాతో కీలక పాత్రలో అవకాశం దక్కించుకుంది. అలాగే ఇప్పుడు సుకుమార్ కూడా త‌న సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఈ బోల్డ్ బ్యూటీనే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news