బంగారంపై స్వల్పంగా వెండిపై భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్: బంగారం, వెండి ధరలు మంగళవారం తగ్గాయి. 24, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై మంగళవారం రూ.110 తగ్గింది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో సోమవారం బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 50,080గా ఉండగా మంగళవారం రూ. 110 తగ్గి.. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ. 45 వేల 910 ఉండగా ఈ రోజు (మంగళవారం) రూ. 45, 800గా ఉంది. విజయవాడ, విశాఖలో కూడా ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.

వెండి ధరలు అయితే భారీగా తగ్గాయి. సోమవారంతో పోల్చితే మంగళవారం కేజీ వెండిపై రూ.500 తగ్గింది. హైదరాబాద్‌లో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 75 వేల 800గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మిగిలిన నగరాల్లో కూడా బంగారం ధరలు తగ్గాయి… తాజా రేట్స్ ఇవే..
చెన్నై: 22 క్యారెట్లు రూ. 46,050, 24 క్యారెట్లు రూ. 50,240
ముంబై: 22 క్యారెట్లు రూ. 47,510, 24 క్యారెట్లు రూ. 48,510
ఢిల్లీ: 22 క్యారెట్లు రూ. 47,950 24 క్యారెట్లు రూ. 52,300
కోల్ కత: 22 క్యారెట్లు రూ. 48,030, 24 క్యారెట్లు రూ. 50,730
బెంగళూరు: 22 క్యారెట్లు రూ. 45,800, 24 క్యారెట్లు రూ.49,970