ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవే!

హైదరాబాద్: బంగారం, వెండి ధరలు సోమవారం నిలకడగా ఉన్నాయి. అయితే ఆదివారంతో పోల్చితే సోమవారం బంగారం మాత్రం రూ. 10 పెరిగింది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 వేల 080 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45 వేల 910గా ఉంది. విశాఖ, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 వేల 080గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45 వేల 910గా ఉంది.

వెండి ధరల్లో ఈ రోజు ఎలాంటి మార్పులేదు.. ఆదివారం ఏ రేటు ఉందో సోమవారం కూడా అదే ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 71 వేల 600గా ఉంది. విజయవాడ, విశాఖలో కేజీ వెండి రూ. 76 వేల 300గా ఉంది.

మిగిలిన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు:
చెన్నై: 22 క్యారెట్లు రూ. 46,160, 24 క్యారెట్లు రూ. 50,360
ముంబై: 22 క్యారెట్లు రూ. 48,310, 24 క్యారెట్లు రూ. 49,310
ఢిల్లీ: 22 క్యారెట్లు రూ. 47,110 24 క్యారెట్లు రూ. 51,260
కోల్ కత: 22 క్యారెట్లు రూ. 47,910, 24 క్యారెట్లు రూ. 50,710
బెంగళూరు: 22 క్యారెట్లు రూ. 45,910, 24 క్యారెట్లు రూ.50,080