Gold-Silver Rates: ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. దూసుక‌పోతున్న ధ‌ర‌లు. అదేబాట‌లో వెండి

-

Gold-Silver Rates: ప‌సిడి ప్రియుల‌కు షాకింగ్ న్యూస్‌.. గ‌త‌వారంలో నేల చూపుచూసిన ప‌సిడి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ధ‌ర‌లు పైకి కదిలాయి. నిన్న పెరిగిన పసిడి ధరల్లో నేడు కూడా పెరుగుద‌ల న‌మోదైంది. మ‌రోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పైపై కి చేరుకుంది. నిన్న 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 4,350లు ఉండగా.. రూ.35 పెరిగి ఈరోజు బంగారం ధర గ్రాముకు రూ. 4,385లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,500 ఉండగా.. ఈ రోజు రూ. 350 పెరుగుదలతో రూ.44,850లకు చేరుకుంది. అలాగే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.47,840కు చేరింది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మ‌రోవైపు.. బంగారం బాట‌లోనే వెండి కూడా క‌దులుతుంది. వెండి కూడా రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా విభిన్న ధరలను నమోదు చేస్తుంది. నేడు కేజీ వెండి ధ‌ర రూ.1300 మేర‌కు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,100కు చేరింది. విజయవాడలో, విశాఖపట్నంలో ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.87 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1763 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 1.44 శాతం తగ్గుదలతో 22.57 డాలర్లకు క్షీణించింది.

బంగారం రేట్లు ప్ర‌ధానంగా.. ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు ఆధార‌ప‌డి ఉంటాయి. దీంతో ఎప్పుడు ధ‌ర‌లు పెరుగుతాయో. ధ‌ర‌లు ఎప్పుడూ త‌గ్గుతాయో చెప్ప‌డం క‌ష్టం.

వెండి కూడా రోజు రోజుకీ దేశ వ్యాప్తంగా విభిన్న ధరలను నమోదు చేస్తుంది. దేశంలో గురువారం సెప్టెంబర్ 23నాటికి భారత మార్కెట్‌లో కిలో వెండి రూ.60,900గా ఉంది. అయితే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాల్లో వెండి ధర భారీగా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.65,100 ఉండగా.. ఇదే ధర విజయవాడలో, విశాఖపట్నంలో కూడా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news