ప్రపంచానికి 50కోట్ల డోసులు అందిస్తాం.. జో బైడెన్

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లను అన్ని దేశాలు అభివృద్ధి చేయలేదు. ఇండియా, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ ఇంకా కొన్ని దేశాలు తప్ప మిగిలిన దేశాలు వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెట్టలేదు. దానికి ఆర్థిక కారణం కూడా కావచ్చు. ఆర్థికంగా పెద్దగా నిలకడ లేని దేశాలు వ్యాక్సిన్ కోసం ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. ఇండియా కూడా ఇతర దేశాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని అందించింది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 70శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని జో బైడెన్ తెలియజేశారు.

ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత రెట్టింపు చేస్తామని, వచ్చే ఏడాది నవంబరు వరకు 50కోట్ల డోసులను ప్రపంచ దేశాలకు అందిస్తామని ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో తెలిపారు. అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ ని పెద్ద ఉత్పత్తి చేస్తామని, ప్రపంచ దేశాలకు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news