వేసవిలో గోంగూర అనుకూలమైన పంట..సాగులో మెళుకువలు..

-

వేసవిలో పంటలు వెయ్యాలి అంటే జనాలు విపరీతంగా భయ పడతారు. ఎందుకంటే ఎండ వేడికి పంట ఎండి పోతుందని, సరైన దిగిబడి రాదని రైతులు ఆలొచిస్తున్నారు.ఆకు కూరలల్లో గోంగూర అనుకూలమైన పంట..వేసవిలో ఈ పంటను అనువుగా ఉంటుంది. ఇతర ఆకు కూరలతో పోల్చితే గోంగూర సాగు రైతులకు మంచి అదాయం తెచ్చిపెడుతుంది. ఆకు కూరల్లో గోంగూరకు ప్రత్యేక స్ధానం ఉంది.. ఇందులో శరీరానికి కావలసిన అన్నీ పొషకాలు, విటమిన్స్‌, మినరల్స్ అధికంగా ఉంటాయి.

—————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————–

నీటి వసతి కలిగిన భూముల్లో ఎకరానికి 4టన్నుల దిగుబడి వస్తుంది. గోంగూరను ఎర్రనేలలు, తేలిక రకపు నేలలతోపాటుగా, మురుగు నీరు పోయే సౌకర్య ఉన్న నేలల్లో సాగు చేయవచ్చు. ఎర్ర గోంగూర రకం వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కరానికి 5 నుండి 6టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది. ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తనం వేసిన నాటి నుండి 4రోజులకు నీటి తడిని ఇవ్వాలి. కోత కోసిన ప్రతిసారి ఈ పంటకు యూరియా వెయ్యాలి.ప్రతిసారి 10 కిలోల యూరియా వేసి నీరు పారించాలి.

ఈ పంటకు ఎక్కువగా పురుగు మందులు వాడక పోవడం మంచిది.తప్పనిసరి పరిస్ధితుల్లో మాత్రమే పురుగుమందులు వాడాలి. గోంగూర పంటను ముఖ్యంగా దీపపు పురుగులు, పిండినల్లి, పచ్చ పురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. వీటి నివారణకు వేపనూనెను ఒక లీటరు నీటిలో 5మి.లీ కలిపి పిచికారీ చేయాలి. లేదంటే మలాధియాన్ మందును ఒక లీటరు నీటిలో 2మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.. మొక్కలను వేసిన 15 రోజులకు ఒకసారి పంటను పైన కొసలను గిల్లితే మొక్కలు మంచిగా పెరుగుతాయి..5 కోతలు కోసిన తరువాత విత్తనం కోసం వదిలిపెట్టాలి. ఇలా చేస్తే గోంగూర సాగులో అధిక దిగుబడులు సాధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది..అందుకే ఈ పంటను సిరుల పంట అని రైతన్నలు అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news