అరకు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్లు అందరికీ బంగారం లాంటి వార్త చెప్పిన విజయ్ సాయి రెడ్డి ?

-

భారతదేశంలో ప్రకృతి అందాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడే పర్యాటకులు అరకు ప్రాంతాన్ని చూడటానికి కూడా ఇష్టపడతారు. దేశ టూరిజంలో అరకు ప్రాంతానికి మంచి క్రేజ్ ఉంది. దీంతో టూరిజంలో ఈ ప్రాంతానికి పర్యాటకులు సందర్శించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో టైమ్ లో పర్యాటకులు ఈ ప్రాంతానికి కొన్ని వేల సంఖ్యలో వస్తుంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ప్రాంతానికి రావాలంటే రైలు మరియు రోడ్డు మార్గాలు ఉన్నాయి. Image result for arakuకానీ ఎక్కువగా మాత్రం పర్యాటకులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు మార్గంమధ్యలో గుహలు చూడటానికి చాలా అందంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా రైలు మార్గాన్ని ఇష్టపడతారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసిపి పార్టీ ఉండటంతో విశాఖపట్నం కి సంబంధించిన పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ విషయాలను చూసుకుంటున్న విజయసాయిరెడ్డి అరకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ బంగారం లాంటి వార్త అందించారు.

 

అదేమిటంటే ఈ ప్రాంతంలో ఉన్న కొద్దీ పర్యాటకుల డిమాండ్ పెరగటంతో విశాఖపట్నం అరకు మధ్య నడిచే రైలుకు మరో అయిదు విస్టాడోమ్‌ కోచ్‌లను అదనంగా ఏర్పాటు చేయాలని విజయ సాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. విజయ సాయి రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అయింది. అరకు ప్రాంతానికి రైలు మార్గాన్న వెళ్ళటానికి అవస్థలు పడుతున్న పర్యాటకులకు ఇది గ్యారెంటీగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

Read more RELATED
Recommended to you

Latest news