వాట్సాప్‌లో ఇత‌రులు డిలీట్ చేసిన మెసేజ్‌ల‌ను.. ఇలా చూడండి.!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో వాట్సాప్.. డిలీట్ మెసేజ్‌.. అనే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో వాట్సాప్‌లో మ‌నం పంపిన మెసేజ్‌ను వెంట‌నే డిలీట్ చేయ‌వ‌చ్చు. దీంతో అవ‌త‌లి వారు కూడా దాన్ని చూడ‌లేరు. అందుకు 7 సెక‌న్య వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంటుంది. అయితే ఎవ‌రికైనా స‌హ‌జంగానే అలా డిలీటైన మెసేజ్‌ల‌ను చూడాల‌ని ఉంటుంది. ఆ మెసేజ్‌ల‌లో ఏం ఉందో చూడాల‌నే కుతూహ‌లం ఉంటుంది. అయితే ఓ యాప్ ద్వారా అది సాధ్య‌మ‌వుతుంది. అది ఎలాగంటే…

this is how you can see deleted messages in whatsapp

వాట్స్‌రిమూవ్‌డ్‌+ (whatsremoved+). ఈ యాప్ ద్వారానే ఇత‌రులు వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో అవ‌త‌లి వారు డిలీట్ చేసిన టెక్ట్స్ మెసేజ్‌ల‌తోపాటు ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్‌ను కూడా మ‌నం తిరిగి పొంద‌వ‌చ్చు. ఈ యాప్ ప్ర‌స్తుతం కేవ‌లం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై మాత్ర‌మే యూజర్ల‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో ల‌భిస్తోంది. దీన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఆపై ఇక ఎవ‌రు ఏ మెసేజ్‌ను వాట్సాప్‌లో డిలీట్ చేసినా.. దాన్ని మ‌నం తిరిగి పొంద‌వ‌చ్చు. ఎందుకంటే ఈ యాప్‌లోనూ ఆ మెసేజ్‌లు సేవ్ అవుతాయి. కాబ‌ట్టి వాట్సాప్‌లో ఒక వేళ మెసేజ్‌లు డిలీట్ అయినా.. ఈ యాప్ ఓపెన్ చేస్తే.. అందులో డిలీట్ అయిన మెసేజ్‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇలా ఈ యాప్ ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే, డిలీట్‌ చేయబడ్డ మెసేజ్‌లన్నీ మ‌న‌కు కనిపిస్తాయి. దాంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలు, ఆడియోలతో సహా అన్నింటినీ తిరిగి మ‌నం చూడ‌వ‌చ్చు. అయితే అన్ని మెసేజ్‌లు ఈ యాప్‌లో కనిపిస్తాయి కాబట్టి మ‌నం బ్యాంకు సంబంధ‌త లావాదేవీలు జ‌రిగే స‌మ‌యంలో ఒకింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే మ‌న‌కు వ‌చ్చే ఓటీపీల‌ను ఇత‌రులు తెలుసుకుంటే మ‌న డ‌బ్బు చోరీకి గుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

వాట్స్‌రిమూవ్‌డ్ ప్ల‌స్ యాప్‌ను ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి…

స్టెప్: 1 – గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి whatsremoved+ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి.
స్టెప్: 2 – యాప్ ఇన్‌స్టాల్‌ అయ్యాక ఓపెన్ చేసి అది అడిగే అన్ని రకాల పర్మిషన్స్ ను ఓకే చేయాలి.
స్టెప్: 3 – తర్వాత వెనక్కి వెళితే ఏ యాప్‌ను సెలెక్ట్‌ చేయాలో అడుగుతుంది. ఆ లిస్ట్‌లో నుండి ‘వాట్సాప్‌’ను సెలెక్ట్‌ చేసి, నెక్స్ట్‌ కు వెళ్లాలి.
స్టెప్‌: 4 – తర్వాతి స్క్రీన్‌లో Yes, Save Files అని, Allow ప్రెస్ చేయాలి. దీంతో ఇన్‌స్టాల్‌ సెటప్‌ అంతా పూర్తయి, యాప్‌ వినియోగానికి సిద్ధమవుతుంది.
స్టెప్: 5 -ఇక అప్పటి నుంచి మీకు వాట్సప్‌లో వచ్చే అన్ని మెసేజ్‌లు whatsremoved+ లో కూడా కనబడతాయి. డిలీటెడ్‌ మెసేజ్‌లతో సహా క‌నిపిస్తాయి. ఇందుకు మీరు చేయవలసిందల్లా, యాప్‌ ఓపెన్‌ చేసి, టాప్‌ బార్‌లో వాట్సాప్‌ను సెలెక్ట్‌ చేసుకోవడమే.

కాగా ఆపిల్‌ ఐఫోన్లకు ఈ యాప్ ప్ర‌స్తుతం అందుబాటులో లేదు. అందులో భద్రతా ఏర్పాట్లు కఠినంగా ఉంటాయి కాబట్టి ఈ యాప్ ప్ర‌స్తుతం ఐఫోన్లకు ల‌భించ‌డం లేదు. ఇక మీ ఫోన్‌కు పెద్దగా భద్రత అక్కర్లేదనుకుంటే హ్యాప్పీగా ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news