ఏపీ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ శుభవార్త‌..ఇవాళే పీఆర్సీ పై ప్ర‌క‌ట‌న !

పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌ పై దూకుడు పెంచింది ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఫిట్ మెంట్ పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది. కాసేప‌టి క్రిత‌మే.. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి… క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ. మ‌రి కాసేప‌ట్లోనే… ఏపీ ఉద్యోగుల ఫిట్ మెంట్ అంశం పై సజ్జల, సమీర్ శర్మ తో సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

27 శాతం ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్ మెంట్ కావాల‌ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. దీనిపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. ప్ర‌భుత్వం సుముఖత వ్య‌క్తం చేయ‌డం లేదు. అటు తాము అడిగినంత ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేన‌ని ఏపీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే..ఇలాంటి త‌రుణంలోనే.. సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి… ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణా రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ ల‌తో స‌మావేశం కానున్నారు. ఇవాళ సాయంత్ర‌మే.. పీఆర్సీ పై ప్ర‌క‌ట‌న వ‌చ్చే చాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.