BREAKING : బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కి ఈడీ నోటీసులు..

బాలీవుడ్ నటి, అభిషేక్ బ‌చ్చ‌న్ భార్య‌ ఐశ్వర్య రాయ్‌కు ఊహించ‌న షాక్ త‌గిలింది. ఇవాళ బాలీవుడ్ న‌టి ఐశ్వర్య రాయ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పనామా పేపర్ లీక్ కేసు లో ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ లోని ఈడీ హెడ్ క్వార్ట‌ర్స్ లో ఐశ్వర్య రాయ్‌… హాజ‌రుకావాల‌ని నోటీసులల్లో పేర్కొన్నారు ఈడీ అధికారులు.

2016లో పనామాకు చెందిన ఓ న్యాయ సంస్థకు చెందిన 11.5 కోట్ల పన్ను పత్రాలు యూకేలో లీక్ అయ్యాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, వ్యాపారులు, ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఇందులో బచ్చన్ కుటుంబం పేరు కూడా ఉంది. ఒక నివేదిక ప్రకారం, అమితాబ్ బచ్చన్ 4 కంపెనీలకు డైరెక్టర్‌గా చేశారు. వీటిలో మూడు బహామాస్‌లో ఉండగా, ఒకటి వర్జిన్ దీవులలో ఉన్నాయి. అయితే.. ఐశ్వర్య గతంలో ఇందులో ఓ కంపెనీకి డైరెక్టర్‌గా చేసింది. ఈ నేప‌థ్యంలోనే.. ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా పనామా పేపర్ల కేసులో నెల రోజుల కింద‌టే.. అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.