ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి సెలవులను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేట్ విద్యా సంస్థలను హెచ్చరించింది.
10 రోజులు హాలిడేస్ రావడంతో హాస్టళ్లలోని విద్యార్థులు అంతా నిన్న సాయంత్రమే సొంత ఊర్లకు చేరుకున్నారు. అకాడమీ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు 11 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి.