ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలోని గవర్నమెంట్ మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీలో 49 స్పెషాలిటీలో 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

ఈ పోస్టులకు వయసు 45 ఏళ్లు మించకూడదని ఈ నోటిఫికేషన్ లో పేర్కొంది. పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుందని వెల్లడించింది. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.11.2022 గా నిర్ధారించారు. https://dme. ap.nic.in / వెబ్ సైట్ లో 1,458 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.