సచిన్ కూతురు… సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమయాణం సాగుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ వార్తలు వారిందరూ ఇంత వరకు ఖండించలేదు. దీంతో.. వారి మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్లు అందరూ నమ్మేశారు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం గిల్, “దేవతలతో ప్రేమలో పడకూడదు” అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో సారాతో బ్రేకప్ అయ్యిందంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేశారు.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్, పటౌడి వారసురాలు సారా ఆలీ ఖాన్ తో కలిసి శుభమన్ డిన్నర్ కు వెళ్ళినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడు సారా ప్రేమలో పడ్డారంటు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ పంజాబీ చాట్ షోలో పాల్గొన్న గిల్ కు ఎందుకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అంటూ హోస్ట్ అతడిని ప్రశ్నించారు.
సారా గురించి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం నిజం చెప్పేయాలి అనగా, ఇందుకు బదులుగా, “సారా సారా సచ్ బోల్ దియా నేను డేటింగ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు” అని పేర్కొన్నాడు. ఇక బాలీవుడ్ లో అత్యంత ఫిట్ గా ఉండే నటి ఎవరు అని అడగ్గా, “సారా” అంటూ గిల్ బదులు ఇవ్వడం విశేషం. దీంతో గిల్-సారా ప్రేమ నిజమేనని ఈ యువ క్రికెటర్ కన్ఫామ్ చేసేసాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Ck-2bl_joKF/?utm_source=ig_web_copy_link