బ్యాంక్ కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంక్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నారు.. ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు వడ్డీల రేటును పెంచారు.ఇప్పుడు మరో బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది.కొత్త వడ్డీ రేటు మే 23 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వివిధ కాలాలకు వడ్డీ రేటును 1 శాతం వరకు పెంచింది. బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనిష్టంగా 3.5 శాతం, గరిష్టంగా 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు అన్ని పదవీకాలాల్లో 0.50 శాతం ఎక్కువ. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మన దేశంలో సంప్రదాయ పెట్టుబడి సాధనాలు. FD రాబడి స్టాక్ మార్కెట్ ధరల పై ఆధారపడి ఉంటుంది.
బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 7-29 రోజులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.50 శాతం. ఇంతకు ముందు ఈ కాలానికి వడ్డీ రేటు 2.5 శాతం ఉండేది. 30-90 రోజులకు, ఇంతకుముందు 3 శాతం ఉన్న వడ్డీ రేటు 4 శాతానికి పెరిగింది. 91-180 రోజుల వడ్డీ రేటు గతంలో 3.5 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది. 181 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ రేటు గతంలో 4.75 శాతంగా ఉండగా, ఇప్పుడు 5.75 శాతానికి పెరిగింది. 1-2 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు గతంలో 5.75 శాతం ఉండగా, ఇప్పుడు 6 శాతానికి పెరిగింది. ఈ కాలానికి వడ్డీ రేటు 0.25 శాతం పెరిగింది.
2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు వడ్డీ రేటు 6 శాతం. వడ్డీ రేటు 3 సంవత్సరాల 1 రోజు నుండి ఐదు సంవత్సరాల కాలానికి 6.25 శాతం.5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6 శాతం ఉంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు..అంతేకాదు సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లు పెరిగినట్లు చెబుతున్నారు..ఫెడరల్ బ్యాంక్ 7 రోజుల నుండి 2223 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 2.65 శాతం నుండి 5.75 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది. కాగా, సీనియర్ సిటిజన్లకు వీటిపై 3.15 శాతం నుంచి 6.40 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇంతకుముందు బ్యాంక్ 7 నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీ రేటు అందించేది.ఇప్పుడు మాత్రం 2.65 శాతానికి పెంచినట్లు తెలుస్తుంది.