పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింఘాల్‌ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించినట్లు సీఎంఓ ప్రకటించారు.
మంత్రికి సంబంధించిన అవినీతి ఆరోపణపై పూర్తి సమాచారం ఉందని, వాటిపై విచారణ కూడా చేయిస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు పంజాబ్ సీఎంఓ కార్యాలయం నుంచి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య మంత్రి విజయ్ సింఘాల్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టుల విషయంలో కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎంఓ వెల్లడించింది. దీనిపై పూర్తి విచారణ జరుగుతుందని, మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.