కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచేటట్టు కనపడుతోంది. ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తోన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కనుక పెంచారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెరుగుతాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచేందుకు ప్రభుత్వం త్వరలోనే పెంచేలా కనపడుతోందని పలు మీడియా రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. కనీస వేతనాలను పెంచాలని చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాన్ని రూ.18 వేల నుంచి రూ.26 వేలు చేయాలని అనుకుంటున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 టైమ్స్ నుంచి 3.68 టైమ్స్ పెంచాలని అడుగుతున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కనుక పెంచారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా పెరుగుతాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రేట్ల తో రూ.18 వేల బేసిక్ వేతనం లభిస్తుంది.
ఒకవేళ 3.68 రెట్ల ఫిట్‌మెంట్ ప్రకటిస్తే అప్పుడు రూ.8 వేల వరకు పెరగనుంది. బేసిక్ పే రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరగనుంది. ఏడవ వేతన సంఘం సిఫారసులను కేంద్ర కేబినెట్ 2017 జూన్‌లో ఆమోదించింది. అప్పుడు బేసిక్ వేతనాన్ని రూ.7 వేలు పెంచి, రూ.18 వేలకు తీసుకు రావడం జరిగింది. ఇది ఇలా ఉంటే సెక్రటరీ స్థాయి ఉద్యోగుల వేతనాన్ని రూ.90 వేల నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది.
క్లాస్ 1 ఆఫీసర్ల ప్రారంభ వేతనం అయితే రూ.56,100గా ఉంది.