కరోనా ఖతం… ఇండియాలో 2 వేలకు దిగువన కరోనా కేసులు… తగ్గిన మరణాలు

-

కరోనా ఖతం అయింది. గత కొన్ని రోజులుగా ఇండియాలో రోజూవారీ కేసుల సంఖ్య రెండు వేలకు దిగువనే ఉంటున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. గతేడాది డిసెంబర్ చివర్లో, ఈ ఏడాది జనవరిలో దేశంలో కేసులు సంఖ్య లక్షల్లోకి చేరింది. థర్డ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరిగాయి. అయితే రెండో వేవ్ లా మరణాలు మాత్రం పెద్దగా నమోదు కాలేదు. దేశంలో అర్హులైన వారంతా వ్యాక్సినేషన్ తీసుకోవడంతో మరణాల సంఖ్య తగ్గింది. రికవరీ రేటు పెరిగింది. 

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో కేవలం 1549 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనాతో బాధపడుతూ.. 31 మంది మాత్రమే చనిపోయారు. ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 1,81,24,97,303 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం 12-14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రానున్న రోజుల్లో దేశంలో  కోవిడ్ కేసులు మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news