మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్..!

-

కేంద్ర ప్రభుత్వం మరో సారి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్తని అందించనుంది. డియర్‌నెస్ అలవెన్స్ ని మరో సరి పెంచనున్నట్టు తెలుస్తోంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ 2022 మార్చి నెలలో 1 పాయింట్ పెరిగింది. అయితే ఇండెక్స్ ద్రవ్యోల్బణం పెరగడం వలన ప్రభుత్వం మళ్లీ డీఏను పెంచేలా కనపడుతోంది.

డీఏను ప్రభుత్వం జూలై నెలలో సమీక్షించనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్‌ గణాంకాలు విడుదల కావాలి. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలలకు చెందిన గణాంకాలు కూడా వచ్చిన తర్వాత ప్రభుత్వం డీఏను ఏ మేర పెంచాలో చూస్తుంది. అయితే డీఏను మళ్లీ 3 శాతం వరకు పెంచుతుందని..పలు మీడియా రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది.

ప్రతీ సంవత్సరం కూడా రెండు సార్లని డీఏను ప్రభుత్వం చూస్తుంది. తొలిసారి జనవరి నుంచి జూన్ మధ్యలో, రెండోసారి జూలై నుంచి డిసెంబర్ మధ్యలో డీఏను సమీక్షిస్తుంది. ఈ ఏడాది మార్చిలో మొదట డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచారు.

మార్చి నెల లో పెంచిన డీఏతో ఉద్యోగులకు 34 శాతం డీఏ లభిస్తోంది. అయితే ఇలా చేయడం మూలాన 1.16 కోట్ల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. అయితే ఈసారి మూడు శాతం పెంపు కనుక ఉంటే ఉద్యోగుల జీతంలో డీఏ 37 శాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news