క్రెడిట్ కార్డు యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బిల్ పే మీ ఇష్టం..

-

క్రెడిట్ కార్డును వాడుతున్నారా? టైం కు బిల్లును చెల్లించలేక పోతున్నారా? మామూలుగా బిల్ జనరేట్ అయిన 20 రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా బిల్ చెల్లించకపోతే పెనాల్టీ, వడ్డీ భారం పడుతుంది. ఒకసారి బిల్లింగ్ సైకిల్ ఫిక్స్ అయిందంటే ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయ్యేవరకు అందులో మార్పు ఉండదు.. అయితే మీకో గుడ్ న్యూస్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1 నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ బిల్లింగ్ సైకిల్ ఒకసారి మార్చుకోవచ్చు. అంటే క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరింది.క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండే తేదీలో బిల్ చెల్లించేందుకు బిల్లింగ్ సైకిల్ మార్చాలని బ్యాంకును కోరొచ్చు. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది..

ఎలాగంటే..ఓ వ్యక్తికి 5 వ తేదీ బిల్ క్రియేట్ అయితే, 20 వ తేదీని ఎంచుకున్నారని అనుకుందాము..అప్పుడు బిల్ చెల్లించడానికి 20 రోజుల సమయం ఉంటుంది. అంతలోగా సాలరీ వస్తుంది కాబట్టి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయొచ్చు. ఇలా క్రెడిట్ కార్డ్ యూజర్లు తమకు అనుకూలంగా ఉండేలా బిల్లింగ్ సైకిల్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ వెసులుబాటును ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలన్న ఒత్తిడి తగ్గించుకోవచ్చు..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే..క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి ఇలా మార్చుకోవచ్చనుకుంటే పొరపాటే. రెండుమూడు క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు… పెనాల్టీ పడకుండా జాగ్రత్త పడవచ్చు..ఇది కొంతవరకూ ఉపశమనం కలిగిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news