వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్..!!

-

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. సీనియర్ సిటిజన్స్‌ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది..డైమండ్ డిపాజిట్ పథకంపై 8 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. పెరిగిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చాయి..ఇక ఈ బ్యాంక్ సెఫైర్‌ డిపాజిట్స్, స్పెషల్ డిపాజిట్స్, ప్రీమియం డిపాజిట్స్, రెగ్యులర్ డిపాజిట్స్ వంటి స్కీమ్స్ సీనియర్ సిటీజన్స్ కోసం ప్రవేశపెట్టింది.. ఈ బ్యాంకు వడ్డీ రేట్లు అనేవి కస్టమర్లు తీసుకొనే ప్లాన్స్, టైమ్ పిరియడ్ ను బట్టి ఉంటాయి..

*. ఇది ఇలా ఉండగా డైమండ్ డిపాజిట్స్‌ను సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఆఫర్ చేస్తారు. డిపాజిట్ కింద వడ్డీ రేట్లు ఇన్‌కమ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి. 75 నెలల కాలవ్యవధితో ఇన్‌కమ్ ప్లాన్స్ నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ పై వడ్డీ రేట్లు వరుసగా.. 7.70%, 7.75%, 7.80%, 8.00%, 8.00% గా ఉన్నాయి..

*. ఇక సెఫైర్‌ డిపాజిట్ లో పెట్టుబడి పెట్టేవాళ్ళు..ప్లాన్ మోడ్‌ను బట్టి 7.45% నుంచి 7.70% మధ్య వడ్డీని పొందుతారు. ఈ స్కీమ్ కాలపరిమితి 45 నెలలు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ ఇన్‌కమ్ ప్లాన్స్‌పై వడ్డీ రేట్లు వరుసగా 7.45%, 7.50%, 7.55%, 7.70%, 7.70%గా ఉన్నాయి..

*. స్పెషల్ డిపాజిట్ ప్లాన్‌ రెండు టెన్యూర్స్‌గా ఉన్నాయి. ఒకటి 33 నెలలు కాగా, మరోటి 66 నెలలు. వడ్డీ రేటు ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. 33 నెలల కాలవ్యవధి నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక, క్యూములేటివ్‌ ఇన్‌కమ్ ప్లాన్స్‌పై వడ్డీ రేట్లు వరుసగా 7.30%, 7.35%, 7.40%, 7.55%, 7.55%గా ఉన్నాయి. 66 నెల టెన్యూర్ పై వడ్డీ రేట్లు వరుసగా 7.40%, 7.45%, 7.50%, 7.65%, 7.65% గా ఉన్నాయి..

*. ప్రీమియం డిపాజిట్..ఈ డిపాజిట్ ప్లాన్ మూడు టెన్యూర్స్ 15, 22, 44 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేటు ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. 15 నెలల టెన్యూర్‌పై వడ్డీ రేట్లు 7.20% నుంచి 7.45% మధ్య ఉంటాయి. 22, 44 నెలల టెన్యూర్స్‌పై 7.25% నుంచి 7.50% మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి..

*. అదే విధంగా రెగ్యులర్ డిపాజిట్ ప్లాన్..వడ్డీ రేట్లు కూడా ప్లాన్లపై ఆధారపడి ఉంటాయి. 12-23 నెలల టెన్యూర్‌పై వడ్డీ రేట్లు 6.85% నుంచి 7.10% మధ్య ఉంటాయి. 24-35 నెలల టెన్యూర్‌పై వడ్డీ రేట్లు 7.10% నుంచి 7.35% మధ్య, 36-60 నెలల టెన్యూర్‌పై 7.15% నుంచి 7.40% మధ్య.. 61-120 నెలల టెన్యూర్‌పై 7.05% నుంచి 7.30% మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి. వీటన్నిటికీ నెలవారి ప్లాన్ రూ.రూ.40,000 కాగా, మిగతా వాటికి రూ.20,000గా ఉంది.. వీటితో మంచి ఆదాయాన్ని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news