సొంతిల్లు కొనుక్కోనేవారికి గుడ్ న్యూస్..ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు..

-

సొంతిల్లు కట్టుకోవాలని లేదా మన అభిరుచికి తగినట్లు కొత్త ఇంటిని కొనుగోలు చెయ్యాలని అందరూ అనుకుకోవడం సహజం..అయితే ఇల్లు కొనెంత డబ్బులు చాలా మంది దగ్గర ఉండక పోవచ్చు. దానితో బ్యాంక్ రుణాల కోసం ట్రై చేస్తారు.ఈ కారణంతోనే గృహ రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడంతో.. ప్రతి బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేసింది. గత కొన్ని రోజులుగా ఇంటి రుణాలపై రేట్ల పెంపు ట్రెండ్ కొనసాగుతోంది.అయినప్పటికీ కొన్ని బ్యాంకులలో గృహ రుణాలపై చౌకగానే వడ్డీ రేట్లు ఉన్నాయి..ఆ బ్యాంకులు ఏంటో ఇప్పుడు చుద్దాము..గత రెండు నెలల నుంచి వడ్డీ రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే..

మే,జూన్ నెలల్లో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో ఈ రేట్లు రయ్‌మని ఎగిశాయి. రిజర్వు బ్యాంకు ఈ రెండు నెలల్లో రెండు సార్లు 90 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది.ప్రస్తుతం రెపో రేటు 4.9 శాతం వద్ద ఉంది. చాలా గృహ రుణాలు అక్టోబర్ 1, 2019 తర్వాత.. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్కు‌కు అనుసంధానం కావడంతో రెపో రేటు పెరిగిన ప్రతిసారి కూడా ఇంటి రుణాల వడ్డీ రేట్లు ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు రూ.75 లక్షల ఇంటి రుణానికి ఇంకా చౌకగానే వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఆ బ్యాంకులు ఇవే..

బ్యాంకు ఆఫ్ బరోడా.. ఈ బ్యాంకులో రూ.75 లక్షల రుణాన్ని 20 ఏళ్ల కోసం తీసుకుంటే.. ఏడాదికి 7.45 శాతం వడ్డీ రేటును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకుంటే.. రూ.60,190 ఈఎంఐను చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంకు ఆఫ్ ఇండియా.. ఈ రెండు బ్యాంకులు రూ.75 లక్షల గృహ రుణానికి 20 ఏళ్ల టెన్యూర్‌కు వార్షికంగా 7.3 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. ఈ రెండు బ్యాంకులలో గృహ రుణాలు తీసుకున్న వారు.. ప్రతి నెలా రూ.59,506 ఈఎంఐను చెల్లించాల్సి ఉంది.

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు… బ్యాంకు రిపోర్టు ప్రకారం.. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు రూ.75 లక్షల గృహ రుణంపై 20 ఏళ్ల కాలానికి అత్యంత తక్కువ వడ్డీ రేటును విధిస్తోంది. ఈ హోమ్ లోన్‌పై బ్యాంకు ఏడాదికి 7.15 శాతం వడ్డీ రేటు ఉంది..

సెంట్రల్ బ్యాంకు.. చౌకగా ఇంటి రుణాలను తీసుకోవాలనుకుంటే.. మీరు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాను ఆశ్రయించడం మంచిది. రూ.75 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల టెన్యూర్‌ కోసం తీసుకుంటే.. ఈ బ్యాంకు 7.2 శాతం ఛార్జ్ చేస్తుంది. ఈ రుణానికి మనం ప్రతి నెలా రూ.59,051 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news