హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త..?

-

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే అన్లాక్ 4లో భాగంగా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులను ప్రారంభించుకునేందుకు సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన సిటీ సర్వీస్ బస్సులన్నీ మరోసారి రోడ్డెక్కనున్నట్లు తెలుస్తోంది..

ఇక సిటీ సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రస్తుతం ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. అయితే మొదట ప్రయాణికులు అందరికీ 50% బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది అనే విషయాన్ని గ్రహించి ఆయా ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ సర్వీసులపై తెలంగాణ ఆర్టీసీ కసరత్తులు ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరులో సిటీ బస్సులు రోడ్డేక్కనున్నట్టు తెలుస్తుంది. ఇది ఆర్టీసీ ప్రయాణికులు అందరికి శుభవార్త అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news