ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులను ఆకట్టుకుంటే ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను సంస్థ జోడిస్తూ యాప్ ని మరింత అందంగా తయారు చేస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీని వాడకం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో భద్రత విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. యూజర్ ఫ్రెండ్లీ యాప్ గా వాట్సాప్ ని మారుస్తున్నారు.
ఈ నేపధ్యంలో వాట్సాప్ డార్క్‌మోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు వాట్సప్ డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2.20.13 అప్‌డేట్ చేసిన వాట్సప్ అప్లికేషన్‌లో ఈ డార్క్ మోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇక దీనిపై మంచి ఫీడ్ బ్యాక్ సంస్థకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇది ఉంటుంది.
ఇక కీలకమైన ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ ఎంతో అవసరం. రాత్రి వేళల్లో వాట్సాప్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఐఫోన్ యూజర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఐవోఎస్ బీటా వర్షన్‌ను 2.20.20కి అప్‌డేట్ చేస్తే ఈ ఫీచర్ లభిస్తుందని మొదట WABetaInfo వెల్లడించింది. దాదాపుగా ఇది సిద్ధమైందని, డార్క్‌మోడ్‌తో IOS బీటా వర్షన్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేస్తున్నట్లు పేర్కొంది.
NEWS: Those colors are finally fixed in the latest WhatsApp beta for iOS 2.20.20 updates!
BUT.. Switching the theme (light <-> dark) for chat bubbles and empty contact/group icon is still not supported: changing the theme won't switch their style.
WhatsApp is working on it ?? https://t.co/OO8Y7hd82Z
— WABetaInfo (@WABetaInfo) January 26, 2020