కాపుల కోసం జగన్, సంచలన నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ కాపునేస్తం పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసారు. ఈ పథకంలో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలకు రూ.75 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తుంది. ఈ పథకంకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి మార్గదర్శకాలను విడుదల చేసింది.

కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం వర్తించనుంది. కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి నవరత్నాలలో లేని కార్యక్రమం ఇది. కాపు కులాల్లో ఉన్న పేద మహిళలను ఆదుకోవడానికి గాను తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది అంటే…

కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాల మహిళలు.

గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే.

3 ఎకరా లోపు పల్లం భూమి, 10 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న కుటుంబాలకు మాత్రమే.

కారు, ట్రాక్టర్ వంటి 4-వీలర్ వాహనాలు లేని దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తానికి అర్హులు.ప్రభుత్వ ఉద్యోగం కాపు మహిళలు పథకానికి అనర్హులు.

కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను కడుతున్నా ఆ ఫ్యామిలీలోని మహిళలకు పథకం వర్తించదు.

Read more RELATED
Recommended to you

Latest news